AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి ఖాతాలో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడనున్నట్లు తెలుస్తోంది.