ప్రకాశం: ఆన్లైన్ మోసాల పట్ల తర్లుపాడు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై బ్రహ్మనాయుడు సూచించారు. కొందరు కేటుగాళ్లు ఫేక్ వెబ్సైట్లు, ఐడీ కార్డులు, సోషల్ మీడియా గ్రూపులు సృష్టించి పర్సనల్ డేటా, బ్యాంకు వివరాలను సేకరించి ఫలానా సంస్థల అధికారులమని ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. అధికారులని ఫోన్ చేస్తే స్టేషన్లో సంప్రదించాలన్నారు.