‘దానా’ తుపాను బంగాళాఖాతం వైపు వేగంగా కదులుతోంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడనుంది. దీంతో ఒడిశా సర్కారు రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలైన పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను మూసివేసింది. ఈనెల 25 వరకు అమల్లో ఉండనుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆలయాలను తెరవడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆలయాలతోపాటు రాష్ట్ర మ్యూజియాలను కూడా మూసివేశారు.