తూ.గో: రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి కౌన్సిల్ హాల్లో జరిగే ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులు గురించి చర్చ జరుగుతుందన్నారు. కావున కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు హాజరుకావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.