PDPL: మండలం పెద్దకల్వలకు చెందిన కల్వల వెంకటేశ్(33) వరంగల్ రైల్వేస్టేషన్లో మృతి చెందారు. పని మీద సోమవారం వరంగల్‌కు వచ్చిన ఆయన తిరిగి వెళ్లేందుకు మంగళవారం తెల్లవారుజామున డోర్నకల్-కాజీపేట ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు రైలు-ప్లాట్ ఫామ్ మధ్యలో జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అందించారు.