US: ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఆయన గెలిస్తే ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని హెచ్చరించారు. 2016 ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులు ‘లాక్ హర్ అప్’ అంటూ హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ నినదిస్తుంటే ట్రంప్ అడ్డుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అదే ఫార్ములాను ట్రంప్‌నకు హారిస్ మద్దతుదారులు అన్వయిస్తున్నారని, రాజకీయంగా ట్రంప్‌ను లాక్ చేయాలని తెలిపారు.