కాళేశ్వరంపై ఇవాళ్టి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఇంజనీర్లు, బ్యూరో క్రాట్స్ను విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ అధికారులను కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈనెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. ఇరిగేషన్ శాఖ వ్యవహారాలు చూసిన ఐఏఎస్ అధికారులను సైతం ఈ నెల చివరలో విచారణకు పిలిచింది.