ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హసన్ నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ మూడు వారాల కిందట మరణించాడని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. ఆయన హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. దక్షిణ బీరుట్ శివారులో జరిపిన దాడిలో హషీమ్‌తో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ హెడ్ అలీ హుస్సేన్ హజిమా, ఇతర కమాండర్లు చనిపోయినట్లు వెల్లడించింది.