TG: హైదరాబాద్ మాదాపూర్‌లోని బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటి లైసెన్స్‌లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, జీహెచ్ఎంసి పర్మిషన్లను చెక్ చేశారు. అనంతరం పబ్, బార్లలో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లై చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.