TG: హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంకు, అమీర్పేట్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాహనదారులు, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అవసరమైతే అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.