BPT: పంగులూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 23వ తేదీన మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ తేళ్ల నాగమ్మ అధ్యక్షతన జరుగుతుందని ఎంపీడీవో స్వరూప రాణి సోమవారం తెలియజేశారు. ఈ సమావేశంలో ఆయా శాఖలపై సమీక్ష జరుగుతుందని ఆమె చెప్పారు. అధికారులందరూ పూర్తి సమగ్ర నివేదికతో హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు. ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.