న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. తొలి టెస్టు మ్యాచులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అతని ఫిట్ నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయడం ఈ సందేహాలకు కారణమైంది. కాగా, రంజీ ట్రోఫీ 2024లో ఢిల్లీతో జరిగిన మ్యాచులో సుందర్ భారీ శతకం నమోదు చేశాడు.