కూల్ వెదర్, నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటాం. అయితే పరిస్థితి మితిమీరితే మాత్రం అనారోగ్యానికి సూచన అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ప్రారంభానికి సంకేతం కావచ్చు. మూత్ర వ్యవస్థలో ఏర్పడే ఇన్ఫెక్షన్ల వల్ల కూడా పదేపదే మూత్రం వస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. గర్భం దాల్చిన సమయంలో, అతిగా కెఫిన్ వాడకం, ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.