కృష్ణ: పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని మచిలీపట్నంలో సోమవారం మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. గనుల భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎస్పీ ఆర్.గంగాధర్ రావు, డీఎస్పీ అబ్దుల్ సుభాన్, జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర మంత్రి రవీంద్ర పేర్కొన్నారు.