KMM: గుర్రాలపాడు GRR ఇండస్ట్రీస్ నందు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, సీసీఐ కేంద్రాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు.