ఖమ్మం: జూలూరుపాడు మండలం బేతర్లపాడు గ్రామ శివారులో ఉన్న చెక్ డ్యామ్‌లో సోమవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతదేహాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రాణా ప్రతాప్ పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.