NLR: బుచ్చి పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఎమ్మెల్యే వెమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. కోవూరును క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.