AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర అండమాన్పై కేంద్రీకృతమైనట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశమున్నట్లు పేర్కొంది. ఎల్లుండి తుపానుగా మారి.. ఈ నెల 24న ఒడిశా, బెంగాల్ తీరాన్ని తాకనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.