ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న CRPS స్కూల్ వద్ద పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక ‘జస్టిస్ లీగ్ ఇండియా’ అనే ఖలిస్తానీ సంస్థ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మెసేజ్‌లను కొన్ని టెలిగ్రామ్ గ్రూప్‌ల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ గ్రూపులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని టెలిగ్రామ్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.