బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గడిచిన 10 ఏళ్లలో టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించిన మూడో జట్టుగా కివీస్ చరిత్రలో నిలిచింది. ముందుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్‌ను ఓడించాయి. కాగా.. పదేళ్లలో భారత్ సొంతగడ్డపై 48 టెస్టులు ఆడగా.. 36 మ్యాచుల్లో గెలుపొందింది.