ఆస్ట్రేలియా పార్లమెంట్లో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధి లిడియా థోర్ప్.. ఇంగ్లాండ్ వలసవాద విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ‘మా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దొంగిలించింది మాకు ఇవ్వండి. ఇది మీ భూమి కాదు. మీరు మా రాజు కాదు’ అంటూ మండిపడ్డారు.