కృష్ణ: బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హంసలదీవి సాగర తీరం గేట్లను మూసివేసి పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. పాలకాయతిప్ప వద్ద మెరైన్ పోలీసుల గస్తీ నిర్వహించారు. బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో పర్యాటకుల రాకపోకలను నిషేధించినట్లు మెరైన్ సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు.