TG: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలన్నా, పెట్టుబడులు రావాలన్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండాలి. గత పదేళ్లుగా రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా పెరిగిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి డ్రగ్స్‌కు బానిసలను చేస్తున్నారు’ అని అన్నారు.