PPM: సాలూరులో కొలువుదీరిన శ్యామలాంబ అమ్మవారి పండగను వచ్చే ఏడాది మే 20న నిర్వహించనున్నారు. ఆదివారం స్థానిక ఆలయంలో గ్రామపెద్దలు, నాయకులు సమావేశమయ్యారు. యువరాజు విక్రమ చంద్ర సన్యాసిరాజు జాతకాన్ని పురోహితులు పరిశీలించి ముహూర్తం నిర్ణయించగా అంతా అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి పండుగకు తన వంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.