TG: హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ ప్రసంగించిన అనంతరం సీఎం మంచిరేవులలో పర్యటించనున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా.. సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా పోలీసు కళాబృందాలతో ఈ నెల 31 వరకు ప్రధాన కూడళ్ల వద్ద కళాజాత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.