PPM: పార్వతీపురం,పెదమరికి పంచాయతీ, కొత్త ఊరు గిరిజన గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన కేండ్రుక గోపాల్ ఇటీవల జంఝావతి రబ్బరు డ్యాంలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు చినమరికి గ్రామానికి చెందిన బెవర రాజు సోషల్ మీడియా ద్వారా దాతలు ఆదుకోవాలని కోరారు. దాతలు సహకారంతో రూ. 22 వేలు విరాళాలు సేకరించిన రాజు భాధిత కుటుంబానికి అందజేశారు.