WGL: వర్ధన్నపేట 56వ డివిజన్‌కు చెందిన రావుల వెంకట రమేశ్ గౌడ్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాగా, వర్ధన్నపేట నియోజకవర్గం 56వ డివిజన్ అధ్యక్షుడు హరిబాబు ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇకపై రావుల వెంకట రమేశ్‌కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గమనించాలన్నారు.