ATP: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయలచెరువులో సోమవారం లయన్స్ క్లబ్, ఆర్డీటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షుడు చల్లా సూర్యనారాయణ తెలిపారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా నిలుస్తారని, ఆసక్తి ఉన్న వారు రక్తదానం చేయాలని కోరారు.