పెనుమంట్ర మండలం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సోమవారం నుంచి సమగ్ర వ్యవసాయం- సస్యరక్షణ చర్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏడీఆర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ, విస్తరణ అధికారులతో పాటు గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ శిక్షణకు హాజరు కానున్నట్లు చెప్పారు.