ATP: తాడిపత్రి వద్ద బైక్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణ పరిధిలోని కొత్త బ్రిడ్జి వద్ద తాడిపత్రి-నంద్యాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ పరిధిలోని పోరాట కాలనీకి చెందిన నరేశ్ అనే యువకుడు బుగ్గ నుంచి తాడిపత్రికి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.