కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికలో పోటీ చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుమార్తె ప్రియాంక గాంధీ కోసం సోనియా గాంధీ స్వయంగా ఎన్నికల ప్రచారానికి తరలిరానున్నారు. సోనియా చాన్నాళ్ల తర్వాత కేరళ వస్తుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. సోనియా… తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి అక్టోబరు 22న వయనాడ్ లో భారీ రోడ్ షోలో పాల్గొంటారు.