సత్యసాయి: పెనుకొండ మండల కేంద్రంలోని రాంపురం వద్ద ఇటీవల నూతనంగా నిర్మించిన ఎంకేపీ బాలికల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల ఉత్తీర్ణతపై ఉపాధ్యాయునికి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.