TG: హైదరాబాద్‌లోని గచ్చిబోలిలో ISB లీడర్షిప్ సమ్మిట్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధిచలేము. త్యాగాలు లేకుండా గొప్ప నేతలు కాలేము. మంచి నాయకుడు కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలి. ప్రజలతో మమేకమైతేనే ఏదైనా సాధించవచ్చు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణను పోల్చలేను. హైదరాబాద్‌ను దేశానికి రోల్ మోడల్‌గా చేస్తాం’ అని అన్నారు.