NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. రెండు రోజుల నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాల వల్ల నీరు అధికంగా కావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరును వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోందన్నారు.