అమెరికా ప్రభుత్వం నిజాలు మాట్లాడటం లేదని మాజీ రా అధికారి వికాస్ యాదవ్ తల్లి సుధేశ్ యాదవ్ వెల్లడించారు. అమెరికాలోని గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు వికాస్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అతని తల్లి మాట్లాడుతూ.. ‘అమెరికా చెప్పేది నిజమో. అబద్ధమో. నేను ఒకటి చెబుతాను నా కుమారుడు దేశం కోసం పనిచేస్తున్నాడు’ అని తెలిపారు.