CTR: చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం అర్చకులు అమ్మవారిని పంచామృతలతో అభిషేకించారు. తర్వాత అమ్మవారి మూలవర్లను పట్టుచీర, బంగారు ఆభరణాలు, పుష్పాలతో లక్ష్మి దేవి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించగా గ్రామంలోని భక్తులు అమ్మవారిని దర్శించారు.