న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రాహుల్ గణంకాలు టెస్ట్‌ల్లో అంత గొప్పగా లేవు. అతడిని జట్టు నుంచి తప్పించాలి. రాహుల్ స్థానంలో దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న అభిమన్యు ఈశ్వరన్‌ను భారత జట్టుకు ఎంపిక చేయాలి’ అని తెలిపాడు.