ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న శ్రేయాస్ అయ్యర్ మహారాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించాడు. దీంతో త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అయితే అది మన చేతుల్లో ఉండదు. ఉత్తమ ఆటతీరును కనబరచడమే నా ముందున్న లక్ష్యం. చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది’ అని తెలిపాడు.