ELR: ఉంగుటూరు మండలం గోపాలపురం పంచాయతీ పరిధి పందిరెడ్డిగూడెంలో పాడి రైతు కైల ఏడుకొండలు (53). శనివారం పిడుగుపాటుకు గురై మృతిచెందినట్లు వీఆర్వో వేణుగోపాల్ పేర్కొన్నారు. పశువులను మేపేందుకు వెళ్లగా శనివారం వర్షం కురవడంతో చెట్టుకింద నిలబడగా పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. గ్రామస్థులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.