AP: విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఎంవీవీ ఇంటి నుంచి కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇల్లు, కార్యాలయం, మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ నిన్న ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.