AP: వృద్దుల వైద్య బీమా ప్రీమియంపై ఉన్న GSTని పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. జీఎస్టీ కౌన్సిల్ నియమించిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రి పయ్యావుల పాల్గొని మాట్లాడారు. రూ.5 లక్షల వరకు ఉన్న వైద్య బీమా ప్రీమియంపై GST మినహాయింపు ఇవ్వాలని, మిగిలిన అన్ని రకాల వైద్య బీమా పాలసీలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం GSTని 5 శాతానికే పరిమితం చేయాలన్నారు.