NLG: కట్టంగూరు మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో శనివారం రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని 10 నెలలు అయిపోయిన ఇప్పటికీ పూర్తిగా రుణమాఫీ చేయలేదన్నారు.