GNTR: రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉమ్మడి ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా కొల్లిపర మండలంలోని అన్నవరంలో శనివారం నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.