PDPL: జిల్లాలో ఉన్న పిల్లల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అనాధ పిల్లలు, దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.