HYD: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్న భార్యభర్తలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరు పలువురి వద్ద దాదాపు రూ.26 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భార్యభర్తలపై చీటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.