TG: బంజారాహిల్స్ పబ్ ఘటనలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఉద్యోగాల పేరుతో యువతులను పబ్ యాజమాన్యాలు ట్రాప్ చేసి వీకెండ్లో 4 గంటలు పనిచేస్తే రూ.2000 ఆఫర్ చేస్తున్నాయి. పబ్కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ ఎక్కువ మద్యం తాగేలా చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి. కస్టమర్లతో ఎక్కువ బిల్లు చేయించిన వారికి కమీషన్లు.. అసభ్య, అశ్లీల నృత్యాలు చేస్తే ఎక్కువ డబ్బు ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి’ అని పోలీసులు తెలిపారు.