WG: గణపవరం పీహెచ్సీలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం గురువారం జరిగింది. 76 మంది గర్భిణీ స్త్రీలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. మంచి పోషక విలువలు కలిగిన పదార్దాలను తీసుకోవాలని ఐరన్ మాత్రలు, కాల్షియం మాత్రలు వాడాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు.