KDP: జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించినట్లు డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. సెలవు దినాల్లో ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని డీఈఓ హెచ్చ రించారు. తిరిగి 14వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమౌతాయని ఆమె తెలిపారు.