E.G: కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు ఏమీ చేయలేక దేవుణ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని, ఈ విధానం దురదృష్టకరమని మాజీ ఎంపీ భరత్ అన్నారు. శనివారం రాజమండ్రిలోని దేవిచౌక్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు భగవంతుడిపై నిందలు వేశారని అన్నారు.