NLR: కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య ఎస్ విజయ భాస్కర్ రావు, విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కే సునీత హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో మరింత ముందుకు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.